Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నీటి పొదుపు పై అవగాహన కల్పించాలి.డీపీఓ కె. కల్పన .

జై భారత్ వాయిస్ గీసుకొండ. వేసవి కాలం దృశ్య బోరు బావుల, బావులల్లో నీరు అడుగంటుతున్నoదున  గ్రామాల్లో పంచాయితి కార్యదర్శులు నీటి వాడకం పై ప్రజలకు అవగాహణ కల్పించాలని వరంగల్ జిల్లా పంచాయితి అధికారి కటకం కల్పన అన్నారు

గ్రామాల్లో త్రాగు నీరు సమస్య లు తలెత్తకుండా చేపడుతున్న ప్రత్యేక చర్యలను గ్రామస్థాయిలో పరిశీలించేందుకు గీసుకొండ మండలములోని కొనయమాకుల, గీసుకొండ గ్రామాల్లో బుదవారం నాడు పర్యటించారు. గ్రామాలలో మిషన్ భగీరథ తో పాటు అందుబాటులో ఉన్న చేతి పంపులను,బోర్ బావులను,బావులను వాడుకలోకి తీసుకువచ్చి నీటి సమస్య లూ ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మండల కేంద్రంలోని గీసుకొండ గ్రామం లో బావులు,వాటర్ ట్యాంక్ లను పరిశీలించారు. నీరు వృధా కాకుండా నీటి లికేజీలను అరికట్టాలని పంచాయితి కార్యదర్శికి సూచించారు. గీసుకొండ, బాలాయపల్లి గ్రామాల్లో 1076 కుటుంబాలకు 3 ట్యాంకులు,3 బావులు,4 బోర్ బావులు,12 చేతి పంపుల ద్వారా ఎటువంటి సమస్య లు లేకుండా నీటిని అoధిస్తున్నట్లు పంచాయితి కార్యదర్శి వేణు ప్రసాద్ డిపీఓ కు వివరించారు. అనంతరం గ్రామ పంచాయితీ రికార్డులు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠ దామాలను పరిశీలించారు. ఈ కార్యక్రమములో మండల ప్రత్యేక అధికారి ఏ.దేవేందర్, మండల పంచాయితి అధికారి అడేపు ప్రభాకర్,పంచాయితి కార్యదర్శలు నూనె వేణు ప్రసాద్, హేమలత, సిబ్బంది అలీ,రాజు,బద్రి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదినము సందర్భంగా భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ సౌజన్య

Sambasivarao

ఆర్చి నూతన బస్సు షెల్టర్   నిర్మాణానికి భూమి పూజ

గీసుకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలు