మతసామరస్యానికి ప్రతీక రంజాన్
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి…
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):
మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ జరుపుకుంటారని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండలంలోని గుడెప్పాడు గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ మెంబర్, తెలంగాణ ఉద్యమకారుడు, బాబుమియా (చిరు) తన నివాసంలో రంజాన్ పండుగ విందును అందించారు. ఈ కార్యక్రమానికి సిరికొండ మధుసూదనాచారి, ఏసీపి శివరామయ్య, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగూర్ల వెంకటేశ్వర్లు, ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ మాట్లాడుతూ తొలుత మండలంలోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబు మియా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, అదేవిధంగా అన్ని మతాలను కలుపుకుపోయి అందరిలో ఒక్కడిగా కలిసి ఉండే వ్యక్తిత్వం చిరంజీవికి ఉందన్నారు. గత నెల రోజుల నుండి ఉపవాస దీక్షలు చేసి నేడు రంజాన్ పండుగతో దీక్ష ముగించే పవిత్రమైన మాసంగా ముస్లిం సోదరులు భావిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.