Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లాహన్మకొండ జిల్లా

నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయండి: బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ హన్మకొండ
నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాంపూర్ డంపింగ్ యార్డు యందు క్షేత్ర స్థాయి లో పర్యటించి కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను కమీషనర్ పరిశీలించారు.ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ జూన్ మాసాంతానికి బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు లక్ష 87 వేల మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసేసింగ్ మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ప్రతిరోజు 2 మెట్రిక్ టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధం గా వ్యవహరిస్తూ గడువులోగా పూర్తి చేయాలని, ప్రతిరోజు పూర్తి చేసిన చెత్త ప్రాసెసింగ్ సంబంధిత సమాచారాన్ని (నివేదికను) అందజేయాలని, బల్దియా వ్యాప్తంగా ఉన్న 66 డివిజన్ ల నుండి చెత్తను సేకరించి డంప్ యార్డ్ కు తరలించే క్రమం లో రోడ్డు పైన చెత్త పడకుండా వుండేలా వాహనాల పైన కవర్లను ఏర్పాటు చేసేలా చూడాలని ముఖ్య ఆరోగ్యాదికారిని ఆదేశించారు.అనంతరం ప్రశాంత్ నగర్ లో 15 ఎం ఎల్ డి సామర్థ్యం తో నిర్వహించబడుతున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్ టి పి) ను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ట్రీట్మెంట్ పనితీరు విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్భం గా అధికారులు కమీషనర్ కు ప్లాంట్ పనితీరును వివరిస్తూ ప్రతి రోజూ 5 ఎం ఎల్ డి మురికి నీటిని శుద్ధికరిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట ముఖ్య ఆరోగ్య అధికారి డా. రాజేష్, ఎస్ ఇ ప్రవీణ్ చంద్ర, ఈ ఈ లు రాజయ్య, సంజయ్ కుమార్,స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి,సానిటరీ సూపర్వైజర్ పసునూరి భాస్కర్ సానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాకతీయ మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ లో పోలీసు బందొబస్తు ఏర్పాట్లు

సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి

Jaibharath News

నర్సంపేట స్నేహా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

Sambasivarao