అంబులెన్స్ వాహనాలు ఆకస్మిక తనిఖీ
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు ); అంబులెన్స్ 108 వాహనాలను జిల్లా అధికారి లక్ష్మణ్ శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా 108 102 వాహనాల్లోని పనిచేసే మెడికల్ పరికరాలను మరియు మెడిసిన్స్ ను ఆయన పరిశీలించారు. ఇటీవల ఎండల తీవ్రత అధికంగా ఉన్న కారణంగా ప్రజలకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఎల్లవేళలా ఉండాలన్నారు. అంబులెన్స్ సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు .విధుల్లో నిర్లక్ష్యం ఏమాత్రం తగదు అన్నారు. సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈఎంటి రమేష్ ,పైలెట్ ముత్యాలప్రకాష్ ,తదితరులు పాల్గొన్నారు
previous post
next post