Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

26న జరిగే రైతు సదస్సు విజయవంతం చేయాలీ

జై భారత్ వాయిస్ గీసుకొండ
తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా  సదస్సు ఈనెల  26న వరంగల్ నగరంలోని అబ్బని కుంటలోని జిల్లా కార్యాలయంలో జరుగుతుందని జిల్లా నలుమూలల నుండి వచ్చి జయప్రదం చేయాలని
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ కోరారు.రైతు సంఘం గీసుకొండ మండల కమిటీ సమావేశం కొనాయమాకులలో మండల అధ్యక్షుడు మోగిడే పీరయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు.  ఈనెల 26న జరిగే జిల్లా సదస్సు ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు.  ఈ సందర్భంగా సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ  కష్టపడి పండించిన పంటలకు  గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ మధ్య కాలంలో  ప్రకటించిన గిట్టుబాటు ధరలు ఏ మాత్రం రైతాంగాన్ని ఆదుకునే విధంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతాంగము ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూ గిట్టుబాటు ధర చట్టం కోసం చేస్తున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేయడం  దారుణం అన్నారు. వ్యవసాయానికి నష్టం చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వారిని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము కౌలు రైతులకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు రైతు భరోసా పంట రుణాల సౌకర్యం కల్పించాలని కోరారు. కల్తీ విత్తనాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని కల్తీ విత్తనాలను నివారించడం కోసం విత్తన చట్టాన్ని వెంటనే తీసుకురావాలని సరసమైన ధరలకు విత్తనాలు రైతాంగానికి అందించాలని  డిమాండ్ చేసినారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య మాట్లాడుతూ జిల్లా సదస్సుకు ముఖ్యఅతిథులుగా 
హైకోర్టు విశ్రాంతి నాయమూర్తి జడ్జిస్ చంద్రకుమార్, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం,ప్రొఫెసర్ కూరపాటి వెంకట్ నారాయణ, ప్రొఫెసర్ యాదగిరి చార్యులు రానున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా కమిటీ సభ్యులు తిప్పారపు రాజు, మండల కమిటీ సభ్యులు లాడే సమ్మారావు, శంకర్ రావు బరుపటి రవీందర్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆడపిల్లలు ఉన్నత విద్యను పొందితేనే హక్కులు సమానవత్వం సాధ్యం.

10న ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం

ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ*

Sambasivarao