జై భారత్ వాయిస్ గీసుకొండ
గ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండలోని రాంనగర్ వద్ద సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన గీసుకొండ గ్రామానికీ చెందిన చాపర్తి సాంబలక్ష్మి అనే నిరుపేద మహిళ అంత్యక్రియల సహాయార్థం గీసుకొండ గ్రామ సామజిక సేవకులు పెగళ్ళపాటి లక్ష్మి నారాయణ ఐదు వేల రూపాయల ఆర్థికసహాయాన్ని పంపించగా, అట్టి నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యులకు శనివారం అంధచేశారు. ఈకార్యక్రమంలో గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్కసత్యనారాయణ, కోట రాంబాబు,పసుల సంపత్ మరియు స్థానిక రజక సంఘం సభ్యులు చాపర్తి మల్లయ్య, సాంబయ్య, ప్రభాకర్ ,రాజగోపాల్, సుధాకర్, రాజమౌళి, నవీన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.పెగళ్ళపాటి లక్ష్మినారాయణకు బాధిత కుటుంబ సభ్యులు,గ్రామస్థులుకృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post