వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 21
కుటుంబాలు
జై భారత వాయిస్, కుందుర్పి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన *కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ
వైసీపీ ప్రభుత్వం వల్లే కాలువ పనులు ఆలస్యం అయింది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే కుందుర్పి బ్రాంచ్ కేనాల్ పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిస్తా.. గ్రామంలో చాలా వరకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు లేవని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంతో చర్చించి వాటిని ఇచ్చి తీరుతాం.. ఎక్కువగా రోడ్డు ప్రమాద బాధితులు, షుగర్ వ్యాది బాధితులు, పేరాలాసిస్ బాధితులు కూడా ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం వచ్చాక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాదుల బారిన పడిన వారికి ఉపశమనం కలిగే విధంగా చూస్తా, గ్రామంలో ఎక్కువగా ఉన్నత విద్యావంతులు ఉన్నారని గ్రామానికి లైబ్రరీ ఏర్పాటు, మినరల్ వాటార్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానన్నారు.
గత ప్రభుత్వం మిగిల్చి వెళ్లారు, వాటిని మనం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిన్నింటిని తిరిగి పూర్తి చేసి, గ్రామాలకు రహదారులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. తప్పకుండా మే 13 ప్రతి ఒక్కరు *సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు..
తెనగల్లు బీసీ కాలనీ వాసులు 4కుటుంబాలు ఎస్సీ కాలనీకి చెందిన 17 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి కళ్యాణదుర్గం తెలుగుదేశం బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని టీడీపీలో చేరారు..కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.