జై భారత్ వాయిస్ భాగ్యనగరం
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. భాగ్యనగరంలో (హైదరాబాద్ ) వర్షం పడుతుంది పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ చిక్కడపల్లి మణికొండ నర్సింగి కోకాపేట గండిపేట హిమాయత్ సాగర్ రాజేంద్రనగర్ లో భారీ వర్షం హైదరాబాదు నగరంలో లోతట్టు ప్రాంతాల్లో జలమయం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదు నగరవాసులందరూ అవసరమైతేనే తప్ప బయటికి రావాలని మున్సిపల్ ఉన్నతాధికారులు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో కూడా వర్షం పడింది జిల్లాలో వరి, మొక్కజొన్న, మామిడికాయలకు నష్టం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా అకాల వర్షం పడింది మామిడికాయలు నేలరాలయ్యాయి కామారెడ్డి జిల్లాలో కూడా రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి కళ్ళల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది పంట సమయంలో అకాల వర్షం రావడంతో రైతన్నలు నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రైతుల ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈనెల 22, 23 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు
previous post
next post