Jaibharathvoice.com | Telugu News App In Telangana
వైఎస్ఆర్ కడప

మతాంతరీకరణ దేశ భద్రతకే ప్రమాదకరం స్వామీజీల పిలుపు.

సమాజంలో ధర్మానికి హాని కలిగించే శక్తులను అడ్డుకోవాలని, మతాంతరీకరణ దేశ భద్రతకు పెను ప్రమాదమని, ఈ దేశాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవలసిన ముఖ్యమైన భాధ్యత హిందూ సమాజంపై ఉన్నదని పూజ్య స్వామీజీలు పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో కడప శివారులోని శ్రీ లలితా పంచాయతన దేవాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన ధర్మాచార్యుల సమావేశంలో స్వామీజీలందరూ ముక్త కంఠంగా ఈ అంశంపై వారి వారి స్వీయానుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి చిన్మయా మిషన్ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ తురీయానంద స్వామీజీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు అచలానందాశ్రమం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామీజీ మాట్లాడుతూ ధర్మ వ్యాప్తికి ప్రతి మఠాలు, పీఠాలు గ్రామాలలో పర్యటించాలని సూచించారు. తిరుపతి లలితా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ మన ధర్మాన్ని సామాన్యుల వద్దకు తీసుకువెళ్ళాలన్నారు. తిరుపతి రామకృష్ణ మఠం పీఠాధిపతులు శ్రీ సుకృతానందపురి స్వామీజీ మాట్లాడుతూ విద్య ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి అందరం కలిసి పనిచేద్దామన్నారు. భాగ్యనగర క్షేత్ర సంఘటనా కార్యదర్శి గుమ్మళ్ళ సత్యంజీ మాట్లాడుతూ మతాంతరీకరణ వల్ల జరుగుతున్న ప్రమాదాలను వివరించి, వారిని స్వధర్మం లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దక్షిణాంద్ర ప్రాంత కార్యదర్శి కాకర్ల రాముడు, దక్షిణాంధ్ర ప్రాంత సహకార్యదర్శి కోటేశ్వరరావు, ధర్మాచార్య ప్రముఖ్ బి.రాం మహేశ్, స్వామి శివరామానంద సరస్వతి, మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవాస్థానం ప్రతి సంవత్సరం ధర్మాచార్యుల సదస్సు ఏర్పాటుతో పాటు ప్రణాళికా బద్దంగా ధర్మప్రచారాన్ని విసృత పరచాలని ఆ బాధ్యతను విధిగా పాటించాలన్నారు. బ్రహ్మం గారి మఠం ఈశ్వరీయ మఠం పీఠాధిపతులు శివ స్వామి వివిధ జిల్లాల నుండి వచ్చిన 50 మంది స్వామీజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.