జై భారత్ వాయిస్-ఆత్మకూరు);
–
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదర్శ పాఠశాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామంలో రు.8 లక్షల 45 వేల తో నిర్మాణం అవుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్,మండల ప్రత్యేక అధికారి రాజేందర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఓ చేతన్ కుమార్ రెడ్డి, పి ఆర్ ఏ ఈ లతా, ఏపీవో రాజి రెడ్డి తనిఖీలు చేశారు. స్థానికులు ఏడు తరగతులు ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారు విద్యార్థులకు ఎట్లా విద్య బోధన జరుగుతుందని వెంటనే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. అక్కడినుండి లింగమడుగు పల్లె ప్రభుత్వ పాఠశాల లో రు. లక్ష 95 వేల తో చేపట్టిన పనులను పరిశీలించారు.పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు,గ్రామస్తులు అదనపు తరగతి గదులు లేక చెట్ల కిందనే విద్యా బోధన చేయవలసి వస్తుందని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్కు వివరించారు. గత పది సంవత్సరాల నుండి విద్యార్థులు ఉన్న తరగతి గదులు లేక అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. మీరైనా నూతన తరగతి గదులకు నిధులు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఎన్నికల అనంతరం పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులు కావలసిన సకల సౌకర్యాలు పట్ల అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్ అన్నారు. మళ్లీ గ్రామాలను పరిశీలించేందుకు వస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అనంతరం లోక సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను, అక్కడున్న వసతులను తనిఖీలు చేశారు. అక్కంపేట ప్రభుత్వ పాఠశాలను, పోలింగ్ కేంద్రాల వివరాలను అడిగి వాటిని పరిశీలించారు. విద్యార్థులకు మౌలిక వసతులు అయిన మరుగుదొడ్లు వేర్వేరుగా ఉన్నాయా లేవని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో బోధిస్తే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయి అన్నారు. అంగన్వాడి సెంటర్లను తనిఖీలు చేసి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోషకాహారం గర్భిణీలకు, చిన్నపిల్లలకు, బాలింతలకు అందించడంతోపాటు అంగన్వాడి సెంటర్ల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు సమయపాలన, విద్యాబోధనపై, కనీస వసతులు వివరాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఇక క్రమంలో కలెక్టర్ తో పాటు ప్రత్యేక అధికారి జ్యోతి రాణి, ఏ పిఎం లలితాదేవి, జిల్లా నాయకులు ముద్దం కృష్ణంరాజు పంచాయతీ కార్యదర్శులు సునీల్,లావణ్య,సంపూర్ణ పాల్గొన్నారు.
