Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

నిరుపేదలకు విద్యార్థికి ఇన్ఫినిటీ చారిటబుల్ బద్వే నాయక ఆర్థిక సహాయం

నిరుపేద విద్యార్థినికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం

జై భారత వాయిస్ కుందుర్పి,

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థిని షేక్ సమీరా కు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే…. పట్టణానికి చెందిన షేక్ సమీరా కర్నూలు పట్టణంలో బ్రిందావన్ ఇన్స్ట్యూట్ ఆప్ టెక్నాలజీ&సైన్స్ కళాశాలలో డిప్లొమా (C.S.E branch) 3వ సంవత్సరం చదువుతోంది.
కాలేజ్ ఫీజు 30,000/-కట్టలేక కళాశాలకు వెళ్ళలేక 2నెలల నుండి ఇంటివద్దనే ఉంది.విద్యార్థిని తండ్రి షేక్ ఇనాద్ భాష కార్పెంటర్ పని చేస్తూ…పని ద్వారా వచ్చిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతుందని పిల్లల చదువులకు చేసిన అప్పులు ఎక్కువై కళాశాల ఫీజు కట్టలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పత్రికలు సోషల్ మీడియా ద్వారా ట్రస్ట్ గురించి తెలుసుకొని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ తరపున 15000/- ట్రస్ట్ సభ్యుడు లోకేష్ 10,000/- మొత్తం 25,000/- విద్యార్థిని సమీరా మరియు తన తల్లి షేక్ హసీనా కు అందజేశారు
కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్ సభ్యులు లోకేష్,తిప్పేస్వామి,నరహరి పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి పనులపై మండల సమావేశంలో సమీక్ష

Jaibharath News

వడ్డీ పాలెం గ్రామంలో పింఛన్ పండుగ కార్యక్రమం

Gangadhar

79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ. 25,571 కోట్ల లబ్ధి : సీఎం జగన్