జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ, ప్రకటించిన ఏపి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి.ఏపి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా,ప్రచార కమిటీ సభ్యుడిగా గత 10 సంవత్సరాలు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడమేకాకుండా ,కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని 5 మండలాల్లో కలియ తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేశారు రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని, కళ్యాణదుర్గం నియోజక వర్గ కార్యకర్తలతో కలసి కళ్యాణదుర్గం నుండి రఘువీరా స్వగ్రామమైన నీలకంఠాపురం వరకు బైక్ ర్యాలీ చేపట్టి ఒత్తిడి చేసినప్పటికీ ,రఘువీరా రెడ్డి నుండి స్పందన కరువైంది ఐతే నియోజకవర్గ ,జిల్లా స్థాయి నాయకులు,కార్యకర్తలు సహకారం మేరకు కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి రాంభూపాల్ రెడ్డి కి అవకాశం కల్పించింది