Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హన్మకొండ లో ఓటరు అవగాహన ర్యాలీ

జై భారత్ వాయిస్ హనుమకొండ: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధమని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఓటు చైతన్యంపై స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించారు.ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ఓటరు అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుండి  హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు సాగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తప్పకుండా ఓటు వేయాలని పేర్కొన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలన్నారు. ఓటర్లు తమ పక్కనున్న ఓటర్లను కూడా తప్పకుండా ఓటు వేసే విధంగా కృషి చేయాలి అన్నారు.ఈ సందర్భంగా సాంస్కృతిక కళాకారులు ఓటరు చైతన్యంపై  పాటలు పాడి ఆకట్టుకున్నారు.  కలెక్టరేట్ ముందు కోళాటం ఆడి సందడి చేశారు. కొండ సారంగపాణి బృందం ఆలపించిన ఓటు అమ్మ ఓటు, జాజిరి జాజిరి ఓయమ్మా పాటలకు ట్రాన్స్ జెండర్లు, సీనియర్ సిటిజెన్లు, కోలాట బృందాలు నృత్యం చేసి ఆకట్టుకున్నారుఈ సందర్భంగా ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ, స్వీప్ నోడల్ అధికారి నాగ పద్మజ, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సౌరం ప్రవీణ్ కుమార్, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ లైలా, ట్రాన్స్ జెండర్లు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, స్వయంకృషి సంఘం కోళాట బృందం,
సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related posts

పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలిపించండి

Jaibharath News

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Jaibharath News