Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ.మండలములోని మచ్చాపూర్ గ్రామములో శ్రీ హనుమాన్ చిన్న జయంతి వేడుకలను ఆంజనేయ మాల ధరించిన స్వాములు,భక్తులు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా మాల ధరించిన స్వాములకు మాజీ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ “భిక్ష” ఏర్పాటు చేశారు.అనంతరం హనుమాన్ ఆలయం నుండి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు అక్కడినుండి మచ్చాపూర్ గ్రామ వీధుల్లో నిర్వహించిన “నగర సంకీర్తన”లో స్వాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో దూలం శ్రీకాంత్, లక్కర్స్ రవి కుమార్, బోయిన మధుకర్, పత్తిపాక రమేష్, కంబాల రాజు,పోలు సంతోష్, లక్క రాజు, బిల్ల యుగెoధర్, ఏరుకొండ అరుణ్,సురేందర్, మంద రాజు, మొగసాని లక్ష్మణ్, బిల్ల సునిల్, అరసం యాకయ్య, ఆంగోత్ వీరయ్య, సoగినేని కర్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైద్యనాధేశ్వర ఆలయ శివలింగంపై సూర్యకిరణాలు

Jaibharath News

గంగదేవిపల్లిలో పర్యావరణ పరిరక్షణకుసామూహిక అగ్నిహోత్రం

ఉపాధి కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలి-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి