Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి నామినేషన్

ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి నామినేఉంటేషన్

జై భారత వాయిస్,, కళ్యాణదుర్గం

కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే అన్ని రంగాలు అభివృద్ధి చేసి పేద ప్రజల అభ్యున్నతికి బాటలు వేస్తామని ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి అన్నారు. గురువారం కళ్యాణదుర్గంలో తన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేశారని స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించడానికి తనకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.అధికారంతో ఒకరు , డబ్బుసంచులతో మరొకరు పోటీలో వస్తున్నారని వారందరూ నాన్ లోకల్ అంటూ తాను లోకల్ అని ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే, రైల్వే లైన్ పూర్తి కావాలన్నా , 114 చెరువులకు కృష్ణ జలాలు అందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది కాబట్టి స్థానికంగా తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, నరసింహులు, నాగరాజునాయక్, కాంగ్రెస్ నాయకులు మాల ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నామినేషన్ రోజున వైసీపీకి షాక్

Jaibharath News

సూపర్ సిక్స్ పథకాల మహిళల ఆర్థికంగా చేయూత

Jaibharath News

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

Jaibharath News