Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మే 8 లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటి లను అందజేయాలి: ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే

జై భారత్ వాయిస్ వరంగల్
మే 8 వ తేదీ లోగా ప్రతి ఓటరు కు పోలింగ్ చిటిలను అందచేయాలని ఏ ఆర్ ఓ /బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు.గురువారం వరంగల్( తూర్పు) నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల స్థితి గతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఉర్సు గుట్ట జంక్షన్ ప్రాంతంలోని జే ఎస్ ఎం పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఏ ఆర్ ఓ ఇట్టి కేంద్రంలో ర్యాంపు ఏర్పాటు ఎలక్ట్రికల్ సదుపాయం చేయాలన్నారు.శంభుని పేట లోగల వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ లో పర్యటించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న పరిస్థితులను పరిశీలించి కనీస వసతులు కల్పించాలని , బి ఎల్ ఓ లతో మాట్లాడుతూ ఓటర్లకు నిర్దేశిత గడువులోగా ఓటరు స్లిప్ లు అందజేయాలని వారికి సూచించారు. పెరుకవాడ రైల్వే గేట్ వద్ద గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను పరిశీలించి ఇందులో గల 4 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసే గదుల తలుపులు విరిగి ఉన్నందున వాటికి మరమత్తులు చేయించాలని, పాఠశాల మధ్య భాగం లో నీడ కోసం టెంట్ లు ఏర్పాటు చేయాలని,మరుగుదొడ్లు ను పరిశీలించి నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయాలని ఏ ఆర్ ఓ అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో తహసిల్దార్ నాగేశ్వరరావు డీఈలు రవికుమార్ సారంగం కృష్ణమూర్తి ఏఈ సరిత బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు

Sambasivarao

కొమ్మాల దేవస్థానం ఆవరణలో ఘనంగా పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Sambasivarao

వరంగల్ లో రెండు రోజులు నీటి సరఫరా బంద్.

REPORTER JYOTHI