జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన 108 అంబులెన్స్ పైలెట్ పాముల రాజుకు ఉత్తమ అవార్డు లభించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులో 2023 -24 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించినందుకు హానుమకొండ జిల్లా పరకాల108 సర్వీస్ సిబ్బంది ఎంపిక కావడం జరిగినది. నవంబర్ నెల లో కంఠత్మకూర్ చెందిన వ్యక్తి సూసైడ్ చేసుకోగా, సమయానికి సంఘటన స్థలానికి చేరుకొని తగు ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిన పరకాల 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ వక్కల సంజివ్ , పైలట్ పాముల రాజు అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్, స్టేట్ ఆపరేషన్ హెడ్ ఖలీద్, చేతుల మీదుగాఅవార్డు అందుకున్నారు.ఈ యొక్క కార్యక్రమంలో వివిధ జిల్లాలో చెందిన అధికారులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఇన్చార్జి లక్ష్మణ్ వీరికి అభినందనలు తెలిపారు.
previous post
next post