Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అంత్యక్రియలకు ఆర్ధికసాయం అందజేసిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ

జై భారత్ వాయిస్ గీసుకొండ

గీసుకొండ మండలకేంద్రానికి చెందిన చినగారి రాజు అనే వ్యక్తి తీవ్ర కిడ్నీవ్యాధితో బాధపడుతూ, శనివారం రాత్రి నిమ్స్ ఆస్పత్రిలో మరణించడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో మృతుని అంత్యక్రియల నిర్వహణకు సహాయార్థం, గీసుకొండ గ్రామానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి పంపిన రూ5000/-ల నగదు సహాయాన్ని పంపగా, అట్టి నగదును మాజీసర్పంచ్ దౌడు బాబు మరియు గీసుకొండ సోషల్ సర్వీస్ టీమ్ సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ కలిసి మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు పోలీసు కానిస్టేబుల్ చినగారి రాజు, మేకల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్

పేద ప్రజల అభ్యున్నతే కొండా దంపతుల లక్ష్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

ఆర్చి నూతన బస్సు షెల్టర్   నిర్మాణానికి భూమి పూజ