Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల ఆందోళన

జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల మంగళవారం ఉదయం ఆందోళన  నిర్వహించారు తమ భూమిలో రోడ్డు వేయవద్దని గంగుల దయాకర్ పాలకుర్తి సత్యం భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన చేసి పనిని అడ్డుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తమ విలువైన భూములు కోల్పోతున్నామని ప్రభుత్వము తమకు నష్టపరిహారం చెల్లించాక పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది రైతులకు డబ్బులు పడ్డాయని  సుమారు 170 నుండి రైతులకు డబ్బులు వస్తాయనే సమయానికి 2023 నవంబరులో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డబ్బులు ఆగిపోయాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖను, ప్రస్తుత కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలిచ్చారు. అయితే నెల రోజులుగా తమ భూముల నుంచి 200 ఫీట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు సాగుతున్నాయని కన్నీటి పర్వంతమవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి తమకు డబ్బులు వెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని బాదితులు వేడుకుంటున్నారు

Related posts

ఉపాధి కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలి-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

24 నుండి 27 వరకు డ్రాయింగ్ టైలరింగ్ పరీక్షలు

కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలి

Sambasivarao