జై భారత్ వాయిస్ వరంగల్
వరంగల్ పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన సోమయ్య ని వరంగల్ జిల్లా శాఖ టీఎన్జీఒస్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా పుష్ప గుచ్చెం లతో సన్మానించారు.. ఈ సందర్భంగా టిఎన్జీఒఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ సోమయ్య తన 30 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో చిన్న స్థాయి నుండి ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగి నేడు సీనియర్ అసిస్టెంట్ గా పదవీ విరమణ పొందడం చాలా అభినందనీయమని అన్నారు. తన ఉద్యోగానికి సంఘానికి చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా వారి శేష జీవితంలో ఆనందమయంతో, ఆయురారోగ్యాలతో గడపాలని కోరారు. పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సోమయ్య ఉద్యోగం పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఒస్ వరంగల్ జిల్లా కార్యదర్శి గాదే వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, కేంద్ర సంఘ కార్యదర్శి వేముల వెంకన్న జిల్లా బాధ్యులు గద్దల రాజు మధు గణేష్ భరత్ వరంగల్ టీఎన్జీవోస్ ఎడ్యుకేషన్ ఫోరం ప్రెసిడెంట్ శ్రీనివాస్ ప్రాంతీయ పాఠశాల విద్య కార్యాలయ ఏడి రంగయ్య నాయుడు
కార్యాలయ సిబ్బంది సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
previous post