జై భారత్ వాయిస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 42వ డివిజన్కు చెందిన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం నాడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య, 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్ధన్ ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
previous post