పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించ నున్న నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హలులో సాధారణ ఎన్నిల పరిశీలకులు బండారి స్వాగత్ రణవీర్ చంద్ సమక్షంలో వివిధ పొలిటికల్ పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ఐదు అసంబ్లీ సెగ్మెంట్ల ఇవియం ల రెండవ రాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని వరంగల్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ అసంబ్లీ సెగ్మెంట్ లో గల 295 పోలింగ్ బూత్ లకు 1106 బ్యాలెట్ యూనిట్లు, 368 కంట్రోల్ యూనిట్లు, 413 వివి ప్యాట్ లను, పాలకుర్తి లోని 296 పోలింగ్ బూత్ లకు 1110 బ్యాలెట్ యూనిట్లు, 370 కంట్రోల్ యూనిట్లు, 414 వివి ప్యాట్ లను, వరంగల్ తూర్పులోని 230 పోలింగ్ బూత్ లకు 862 బ్యాలెట్ యూనిట్లు, 287 కంట్రోల్ యూనిట్లు, 322 వివి ప్యాట్ లను, వర్షన్నపేటలోని 279 పోలింగ్ బూత్ లకు 1046 బ్యాలెట్ యూనిట్లు, 348 కంట్రోల్ యూనిట్లు, 390 వివి ప్యాట్ లను,భూపాలపల్లి లోని 317 పోలింగ్ బూత్ లకు 1208 బ్యాలెట్ యూనిట్లు, 412 కంట్రోల్ యూనిట్లు, 459 వివి ప్యాట్ లను, బియు లు, సియు లు 125 శాతం, వివి ప్యాట్లు 140 శాతంఆన్లైన్ ద్వారా కేటాయించడం జరిగిందిని, మిగిలిన పరకాల, వరంగల్ పశ్చిమ అసంబ్లీ సెగ్మెంట్లకు ఆదివారం ఇవియంల రెండవ రాండమైజేషన్ చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ యూనిట్లు కేటాయించడం జరిగిందన్నారు.

previous post