Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను గెలిపించండి

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం.కొమ్మాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా కొమ్మాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి 13వ తారీకు రోజున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య గారిని గెలిపించాలని కొరారు.అక్కడ పనిచేస్తున్న ఉపాధి కూలీలను పనుల విషయాన్ని అన్ని వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది అక్కడ ఎండలో పనిచేస్తున్న ప్రజలకు మజ్జిగ అందజేసి వారిని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి. ప్రభాకర్ మాట్లాడుతూ ఈ నెల 13వ తారీకు రోజున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య ని గెలిపించాలని వారిని అభ్యర్ధించారు.

గతంలో ఉపాధి హామీ పని గ్రామీణ ప్రాంతాలలో పనులు దొరకక పస్తులతో చస్తున్నటువంటి సందర్భంలో పనులు దొరకక బస్తీలకు హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి వలస పోతున్న క్రమంలో అప్పుడు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీఆలోచన చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి ఎందరినో ఆదుకోవడం జరిగిందన్నారు రానున్న ఎన్నికల అనంతరం ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈ పనికి రోజుకు 400 రూపాయలకు తగ్గకుండా ఇవ్వడం జరుగుతుందన్నారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు ప్రభుత్వం ఏర్పడగానే విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసి ప్రతి ఒక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మోసం చేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు యువతకు ఇస్తానని చెప్పి మోసం చేశారు ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రవేట్ పరం చేశారు కాబట్టి ఇప్పుడు దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నా రు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం మీరందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సాయిలి. ప్రభాకర్ కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు. స్వామి మహిళ మండల అధ్యక్షురాలు జక్కుల. సరిత కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరకల మోహన్ రెడ్డి బట్ట మేకల. రాజయ్య అశోక్ నరేందర్ మహేందర్ రవి రాజు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jaibharath News

వరంగల్ లో 14న నిరసన దీక్ష:- బిజెపివరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్