Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత

కర్ణాటక మద్యం 432 ప్యాకెట్లు పట్టివేత,,

జై భారత వాయిస్ ,కంబదూరు

కర్నాటక నుండీ జిల్లాలోకి ద్విచక్ర వాహనము ద్వారా అక్రమంగా తీసుకొస్తున్న కర్నాటక లిక్కర్ పట్టివేత* ఒకరి అరెస్టు.432 టెట్రా పాకెట్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనంకర్నాటక రాష్ట్రం, YNS కోట టౌన్ నుండీ ద్విచక్ర వాహనంపై అక్రమంగా అనంతపురం జిల్లాలోకి తరలిస్తున్న కర్నాటక మద్యంకు సంబంధించిన 432 టెట్రా పాకెట్లను కంబదూరుఎస్సైపి.వై.ఆంజనేయుల ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు ఉదయం పట్టుకున్నారు. కంబదూరు మండలం ములకనూరు క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి కర్నాటక నుండీ వస్తున్న ఒక ద్విచక్ర వాహనము పై కర్నాటక టెట్రా పాకెట్లు కల్గిన బాక్సులను తీసుకొని వస్తున్న కంబదూరు మండలం, ములకనూరు గ్రామానికి చెందిన పూజారి తిమ్మరాజు @ తిమ్మ తన బైక్ తో పాటు తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించగా కంబదూరు పోలీసులు పట్టుకున్నారు. పూజారి తిమ్మరాజు ను అరెస్టు చేసి 09 బాక్సులలో ఉన్న 432 టెట్రా పాకెట్లు, ఒక ద్విచక్ర వాహనమును సీజ్ చేశారు. YNS కోట టౌన్ లో తక్కువ ధరలకు కొనుగోలు చేసి కంబదూరు మండలం, ములకనూరు ఆతర్వాత అనంతపురం పరిసర గ్రామాలలో ఎక్కువ ధరలకు విక్రయించాలని తరలిస్తూ పట్టుబడ్డారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS కంబదూరు ఎస్సై పి.వై.ఆంజనేయుల ఆధ్వర్యంలో పోలీసులను అభినందించారు.

Related posts

తలారి రంగయ్యను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం

Jaibharath News

జయం పనింద్ర పర్మిశించిన మంత్రి ఉష చరణ్

Jaibharath News

బొబ్బలి కుంట ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ప్రారంభించబడినది

Jaibharath News