జై భారత్ వాయిస్ హన్మకొండ
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం ,బీఎస్సీ. మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 15వ తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించబడతాయని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడతాయని ప్రిన్సిపల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
