Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)

ఆత్మకూరు, దామెర ఉమ్మడి మండలాల ధూప దీప నైవేద్య అర్చక సంఘం కమిటీ ఎన్నిక మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఎన్నుకోవడం జరిగింది
ఈ కమిటీ ఎన్నికకు తెలంగాణ ధూప దీప నైవేద్య సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆదేశాలతో ఆత్మకూరు మండల కేంద్రము లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆత్మకూరు, దామెర మండలాల సంయుక్త సమావేశం ను నిర్వహించారు.
సంయుక్త మండల కమిటీ అధ్యక్షులుగా కొలనుపాక వీర మల్లయ్య
ప్రధాన కార్యదర్శులు లేదల్ల శ్రీనివాసులు, కొట్టురి సుధీర్ కుమార్, కోశాధికారి ఆరుట్ల మాధవ మూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరి కాల పరిమితి రెండు సంవత్సరాలు. ఈ కమిటీ నియామకానికి సహకరించిన రెండు మండలాల ధూప దీప నైవేద్య అర్చకులకు నూతన కమిటీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల మధుకర్ శర్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వచ్చు నూరి రవీందర్ శర్మ, జిల్లా అధ్యక్షుడు సిద్ధాంతి గణేష్ కుమార్, పరకాల డివిజన్ అధ్యక్షుడు కొలనుపాక భాస్కర శాస్త్రి, రెండు మండలాల అర్చకులు పాల్గొన్నారు.

Related posts

నకిలీ పురుగు మందులు అమ్ముతే కేసులు నమోదు చేస్తాంఆత్మకూరు సిఐ సంతోష్

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్సై కొంక అశోక్

Jaibharath News

దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వనం