జై భారత్ వాయిస్ వరంగల్ :-జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డెంగ్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం సమాజంతో భాగస్వామ్యమై, డెంగ్యూ వ్యాధిని నివారించుదాం అనే నినాదంతో అన్ని శాఖల సమన్వయంతో డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడానికి కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు.ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుధార్ సింగ్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధం లేకుండా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ప్రతి శుక్రవారం డ్రైడే- ఫ్రైడే పాటిస్తూ దోమ లార్వా ఉండే నీటి నిలువ స్థావరాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా వ్యాధులు ప్రబలకుండా నిర్మూలించవచ్చని తెలియజేశారు.ప్రతి డెంగ్యూ వ్యాధి నిర్ధారిత ప్రాంతాలలో యాంటీ లార్వా మరియు దోమల మందులను పిచికారి చేయించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సత్యేంద్రనాథ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గోపాల్ రావు, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, వైద్య సిబ్బంది సోమేశ్వర్, కిరణ్, ప్రకాష్ రెడ్డి, కుమార స్వామి, చక్రపాణి, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

previous post