Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
వేద పండితుల పర్యవేక్షణలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నవేద  పండితుల బృందం- ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొన్న భక్తులు
( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండల కేంద్రం లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మహోత్సవాలను వేద పండితుల పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు శ్రీ వేణుగోపాలస్వామికి ప్రత్యేక పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. వేద పండితులు ఆరుట్ల మాధవ మూర్తి పర్యవేక్షణలో వేద మంత్రోచ్చారణలా మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి పంచామృతాలతో అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఈ బ్రహ్మో త్సవాలలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

ఆరు గ్యారెంటీల అమలు కు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

Jaibharath News

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా