జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనాటి ఉపాధ్యాయులు శివపురం వీరభద్రశర్మ, వేముల సాంబయ్య, ముత్తినేని జయలక్ష్మి, ఐత శ్రీదేవి, కర్ణకంటి రాంమూర్తి లను విద్యార్థులు గౌరవ మర్యాదలతో సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్వ విద్యార్థులు పాఠశాలలో అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఇకపై నుంచి తమ బ్యాచ్ పూర్వ విద్యార్థుల్లో శుభాశుభ కార్యక్రమాల్లో పాల్గొంటామని, ఎవరికైనా అనుకోని ఆపదలు వచ్చినప్పుడు సంఘటితమై ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈకార్యక్రమంలో కోల ప్రదీప్, కర్ణకంటి హరీష్, దౌడు ప్రశాంత్, ఇమ్రాన్ పాషా,తాటికొండ సరిత, తాబేటి సౌమ్య, యంబాడి రాజు కుమార్, కల్పన,కాతమండి భరత్,పీసాల రాజు కుమార్ తదితర 61మంది విద్యార్థులు పాల్గొన్నారు.
