భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్ జిల్లా. గీసుకొండ మండలం.
ప్రజా సమస్యలపై యువత విద్యార్థుల సమస్యల పై నిరంతరం పోరాడి గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు వివరిస్తూ చైతన్య పరుస్తూ కుటుంబ అరాచక పాలనను గద్దె దించే దానిలో ప్రధాన పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్నను వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకుడు సాయిలి. ప్రభాకర్ కోరారు
గత ప్రభుత్వం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను లొసుగులను బయటపెడుతున్న క్రమంలో తీన్మార్ మల్లన్నను ఎన్నో చిత్రహింసలకు గురిచేసి ఎన్నో రోజులు జైల్లో పెట్టిన కూడా ప్రజా సమస్యలపై యువత విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడిన వ్యక్తి శక్తి తీన్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తికి పట్టభద్రులు 100% సహకరించి ప్రత్యర్థులకు డిపాజిట్ గల్లంతయ్యే విధంగా గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి. ప్రభాకర్ కోరారు తీన్మార్ మల్లన్న పై లేనిపోని అపనిందలు ప్రత్యర్ధులు వేసే పనిలో ఉన్నారు పట్టబద్రులు అవి ఏమి నమ్మకుండా మల్లన్నను గెలిపించవలసిన అవసరం ఉన్నదని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు
previous post
next post