April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలుహన్మకొండ జిల్లా

సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి

సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి
అనుకొకుండా మన మొబైల్ ఫోన్ పోయిందా లేదా దొంగతనంగా ఎవరైన దొచుకున్న డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి
సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ లో నమోదు చేయండి -వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా…ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న, చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతనంగా వినియోగంలోకి వచ్చిన సి.ఈ.ఐ.ఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను వాటి యజమానులకు వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం అందజేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న 142 సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి వాటి యజమానులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ టెలికాం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సి.ఈ.ఐ.ఆర్) వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, ఎవరైతే మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారో వారు మొదట అదే నంబర్తో నూతన సిమ్ తీసుకోని, మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి www.ceir.gov.in వెబ్ సైట్లో లాగెల్ చేసి అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్ /స్టాలెన్ మొబైల్ లింక్ను క్లిక్ చేసి, పోయిన సెల్ ఫోన్ ఐయంఈ నంబర్ కంపెనీ పేరు మోడల్, కోనుగోలు చేసిన రశీదు, మరియు మీసేవ దరఖాస్తు రశీదు నంబర్ను అప్లోడ్ చేసి మొబైల్ ఎరోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్ వివరాలు, చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపుకార్డు, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి వుంటుంది. తద్వారా పోయిన మొబైల్ బాక్ అవుతుంది. ఇదంతా పూర్తియిన తర్వాత తమ పరిధిలోని పోలిస్ స్టేషన్లో సమాచారం అందించాలి. పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ సందర్భంగా పోగోట్టుకున్న తమ సెల్ ఫోన్ల తిరిగి అందజేయడంలో కృషి చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ కు సెల్ ఫోన్ యజమానులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్ బి ఏసీపీ డేవిడ్ రాజు, ఐటీకోర్ విభాగం హెడ్ కానిస్టేబుల్ మాధవరావు తో పాటు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గోన్నారు.

 

 

Related posts

జాతీయ స్థాయికి ఎంపికైన అక్షయ్ కుమార్ కు అభినందన

Jaibharath News

CM directs clearance of pending dues, releases Rs 7,358 Crore pending bills to employees

ఫ్లాష్… ప్లాష్…వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్ స్పెక్టర్ల బదిలీలు

Jaibharath News