జై భారత్ వాయిస్ గీసుకొండ :-శ్రీ నృసింహ జయంతి పర్వదినం సందర్భంగా చారిత్రక నేపథ్యం ఉన్న గీసుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై వైభవంగా శ్రీ నృసింహ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం మురళీకృష్ణ ఆచార్యులు, పాకాల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం,హామం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి – మంజుల దంపతులు, కమిటీ సభ్యులు రామా కుమారస్వామి -విజయ, బండారు నరేందర్ – శోభారాణి దంపతులు, కర్ణకంటి రాంమూర్తి, హనుమాన్ దీక్షాధారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
previous post