Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆత్మకూరు లో అంగరంగ వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు ):శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అత్మకూరు లో వైభవంగా జరుగుతున్నాయి. అందు లో భాగంగా నాగవెల్లి తంతు కార్యక్రమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు.గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల చివరి రోజు పురస్కరించుకొని అర్చకులు ఆరుట్ల మాధవ మూర్తి పర్యవేక్షణలో వేద పండితుల బృందం వేద మంత్రో చ్చా రణల తో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి, శ్రీ సీత రామస్వామికి పంచామృతాలు, సప్త నది జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్ష తులసి అర్చన ,నాగవెల్లి తంతును పండితులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ ఉత్సవాల్లో పలకల మంజుల, టింగిల్ కారి సత్యనారాయణ, రేవూరి రణధీర్ రెడ్డి దంపతులు, పరికరాల వాసు,రేవురి జయపాల్ రెడ్డి, పాపని రవీందర్,తనుగుల సందీప్, అల్వాల రవి, మాజీ సర్పంచు లు, మాజీ ఎంపీటీసీలు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాస పూర్ణిమ పురస్కరించుకొని రాత్రి ఎడ్లబండ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. రాత్రి నుండి ఉదయం వరకు జాతర కొనసాగుతున్నది.

Related posts

అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 ఎంజెపి విద్యార్థుల ప్రతిభ

Jaibharath News

దివిటిపల్లి లో ఘనంగా గురుపూజోత్సవం

దళిత బంధు నిధులు తక్షణమే విడుదల చేయాలి