*మద్యం దుకాణాలు బంద్*
ఉమ్మడి వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కి ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులమేరకు నేటి సాయంత్రం 4గంటల నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేసారు.