Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పవర్‌ప్రిడ్‌’లో కొండచిలువ కలకలం

దామెర, మండలంలోని: ఒగ్లాపూర్ గ్రామంలో పవర్‌డిడ్ కార్పొరేషన్ ఆవరణలో శనివారం ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. ఆవరణలో సిమెంట్ దిమ్మెల నుంచి అకస్మాత్తుగా ఓ కొండచిలువ వెళుతూ కనిపించింది. అయితే అప్రమత్తమైన పవర్డ్ సెక్యూరిటీ స్టాఫ్ జి. మనోహర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొండచిలువను స్నేక్ క్యాచర్ సాయంతో ఓ సంచిలో బంధించాడు. ఆ తరువాత జూనియర్ ఇంజనీర్ సంపత్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పి. అశోక్ తమ సిబ్బంది స్వామి, కొమురయ్యతో పాటు అక్కడికి చేరుకోగా అధికారులు ఆ కొండచిలువను అప్పగించారు. ఈ సందర్బంగా పవర్డిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీజీఎం సమ్మయ్య దాసరి, జూనియర్ ఇంజనీర్ సంపత్, కార్యాలయ సిబ్బంది జి. మనోహర్, కె.ఎస్.రాములు, ఎస్.కె. ఖాదర్, బి.రాజుకుమార్, డి.విష్ణు, ఎన్.కుమార్ ఉన్నారు.

Related posts

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు

31 వరకు, అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు!

Sambasivarao

అంబేద్కర్ కు ఉపాధ్యాయ నేతల ఘన నివాళులు