Jaibharathvoice.com | Telugu News App In Telangana
జాతీయ వార్తలు

జమ్ము కాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంతం

భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ అంటేనే ఒకప్పుడు అల్లర్ల హింసలు జరిగేవి తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు చేయడంతో సాధారణ పరిస్థితి ఏర్పడ్డాయి. పార్లమెంటు లోక్ సభ  సార్వత్రిక ఎన్నికలు జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా జరగడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఆయన పిటిఐ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగడం మోదీ సర్కారుకు పెద్ద విజయమని ఆయన అన్నారు. కాశ్మీర్ ఏర్పాటు వాదులు సైతం ఎన్నికల్లో ఓటు వేశారని ఆ ప్రాంతంలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడం గొప్ప విజయంగా భావిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జమ్మూ కాశ్మీరానికి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించి ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తామని రానున్న సెప్టెంబర్ వరకు పూర్తి ప్రక్రియ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

సెల్ ఫోన్ పోయిందా.డొన్టు వర్రీ ఈ ప్రయత్నం చేయండి

Jaibharath News

బాత్రూమ్ లోకి స్నానాకి వెళ్ళిన వ్యక్తి భయంతో బయిటికి పరుగులు

ధర్మారెడ్డి గెలుపు కోసం అరుణాచలంలో ప్రత్యేక పూజలు

Jaibharath News