సొంత ఇంటి నిర్మాణంతో పాటు దుబాయ్‌కు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న అంతర్ జిల్లా దొంగను సిసిఎస్ మట్వాడ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. అరెస్టుకు సంబందించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ వివరాలను మంగళవారం నాడు తెలియచేస్తూ. అరెస్టు చేసిన నిందితుడి నుండి సుమారు 22లక్షల రూపాయల విలువలైన 270 గ్రాముల బంగారు అభరణాలతో పాటు, రెండు ద్విచక్రవాహనం, 50వేల రూపాయల నగదు, ఒక మోబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం, సంకేపల్లి గ్రామం, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసం వుంటున్న జింక నాగరాజు ద్విచక్ర వాహన మెకానిక్‌గా పనిచేస్తూనే ద్విచక్ర వాహనాల క్రమవిక్రయాలతో వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో పాటు మరింత పెద్ద మొత్తంలో డబ్బును సులభంగా సంపాదించాలనే ఆలోచనతో ద్విచక్రవాహనాలు చోరీ చేసి వాటిని అమ్మి డబ్బును జమ చేయలనుకున్నాడు. గతంలొ పలు చోరీలు చేసి అరెస్టు అయి జైలు జీవితం గడిపాడు గత సంవత్సరం మార్చ్ మాసంలో జైలు నుండి విడుదలైన నిందితుడు తాను సొంత ఇంటి నిర్మాణంతో పాటు, దుబాయికి వెళ్ళేందుకు అవసరమయిన డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నిందితుడు మరో మారు చోరీలకు తెగపడ్డాడు. ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు జగిత్యాల, యాదాద్రి జిల్లాలో మొత్తం 20 చోరీలకు పాల్పడ్డాడు. మంగళవారంనాడు నిందితుడు చోరీ చేసిన బంగారు అభరణాలను అమ్మేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో నిందితుడి పట్టుకోనేందుకు మట్వాడా, సిసిఎస్‌పోలీసులు సంయుక్తంగా ఆర్.ఎన్.టి రోడ్డు వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వస్తున్న నిందితుడుని పోలీసులు అనుమానంతో తనీఖీ చేయగా నిందితుడు వద్ద బంగారు అభరణాలు, పెద్ద మొత్తం నగదు లభించడంతో నిందితుడు అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు తాను చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించాడు.నిందితుడుని పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన ట్రైనీ ఐపిఎస్ శుభం నాగ్‌తో పాటు సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్‌బారీ, అదనపు డిసిపి రవి, వరంగల్ ఎసిపి నందిరాంనాయక్, సిసిఎస్,మట్వాడా ఇన్స్‌స్పెక్టర్లు అబ్బయ్య, గోపి, అసిస్టెంట్ అనాటికల్ అఫీసర్ సల్మాన్‌పాషా, సిసిఎస్ ఏఎస్‌ఐ శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు నజీం, ఆహ్మద్, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్, రాములు, వెంకన్న,కిరణ్‌కుమార్, నజీరుద్దీన్, శ్రీకాంత్‌తో పాటు మట్వాడా ఎస్.ఐ కుమార్ కానిస్టేబుళ్ళు అలీ, హరికుమార్ రాజేందర్,ఐటీకోర్ టీం కానిస్టేబుళ్ళు నగేష్,ప్రవీణ్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.
