జై భారత్ వాయిస్ సంగెం
సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరంలో గోక కుమారస్వామి దాత 25,000 రూపాయల విలువ గల స్టడీ మెటీరియల్, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు , వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నిరుపేద, పేద, పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఆల్ ఇన్ వన్ ఉచితంగా పుస్తకాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసమాజంలో జీవిస్తున్న ప్రతి మనిషి తన బాధ్యతగా సంపాదనలో కొంత పేదలకు సాయం చేయాలని, అందులోనే ఆనందం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త, దాత, గోక కుమారస్వామి అన్నారు.సమాజం మనకు ఏమిచ్చిందనేది కాదు, మనం ఏమి చేశామన్నది ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజాభివృద్ధికి సహకరించాలన్నారు.మార్గం స్వచ్ఛంద సేవా సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం సంస్థ ప్రతినిధులు ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు బొజ్జ సురేశ్, సింగారపు బాబు, మునుకుంట్ల కోటేశ్వర్, మునుకుంట్ల కుమారస్వామి, విద్యుత్ డిఈ ఏనబోతుల నర్సింగరావు, పాండ్రాల కరుణ శ్రీ ,పాండ్రాల.కిషన్ కుమార్, మాంకాల యాదగిరి, చిలువేరు శ్రీనివాసులు, చెదులూరి పరిమళ, చంద్రశేఖర్ రాజు ,విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
