జై భారత్ వాయిస్ వరంగల్
తెలంగాణ రాష్ట్రంలో జూన్ మూడవ తేదినుండి పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తోమ్మిది గంటల మూప్పై నిముషాలనుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పాటు జరుగనున్నాయి.
వరంగల్ జిల్లాలో పదవ తరగతి Advanced Supplementary పరీక్షలు జూన్ 3 నుండి 13 వరకు పదవ తరగతి సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించున్నమని వరంగల్ జిల్లా విధ్యాశాఖ అధికారి వసంతి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 806 మంది విద్యార్థులు హాజరు అగుచున్నారని తెలిపారు. వరంగల్ పట్టణం లో 02 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడినవని, పరీక్ష నిర్వహణ కొరకై అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వరంగల్ నగరంలో 1. ప్లాటినం జూబ్లీ హైస్కూల్ “A” పరీక్షా కేంద్రం,2. ప్లాటినం జూబ్లీ హైస్కూల్ “B” పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.పాఠశాల యాజమాన్యములు సకాలంలో పిల్లలను పరీక్ష కేంద్రాలకు పంపించ వలసినదిగా కొరారు. పరీక్ష కేంద్రాల విషయం ఇతర వివరములు గురించి తెలుసుకొనుట కొరకై జిల్లా విధ్యశాఖాధికారి కార్యాలయంలో గల కంట్రోల్ రూమ్ సెల్ 8919974862 నెంబర్ కు సంప్రదించగలరని డిఈఓ సూచించారు.

previous post