Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుకుఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి చేయాలి

జై భారత్ వాయిస్ : భాగ్యనగరం
జూన్ 4వ తేదీ నిర్వహించనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1 లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి అదనపు  సీఈవోలు  సర్ఫ రాజ్ అహ్మద్ ,లోకేష్ కుమార్, డిప్యూటీ సీఈవో, పోలీస్ అధికారులతో కలిసి  రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు(కలెక్టర్లు ),ఎస్పీలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారితో పాటు, ఒక ఇన్చార్జి అధికారిని నియమించాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, గుర్తించిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలన్నారు.  ఇందుకు సరైన విధంగా తనిఖీ చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి రికార్డెడ్ డివైస్ లను అనుమతించవద్దని పేర్కొన్నారు. మీడియాకు మీడియా కేంద్రంలో ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా ఫలితాలు వెల్లడి చేసేలా అదనపు ఏఆర్వోలను నియమించాలని, మీడియాతో పాటు ప్రజలకు తెలిసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, వివిధ రకాల ఫారాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.అంతకు ముందు  అదనపు సీఈవోలు  ఎన్నికల ఓట్ల లెక్కింపునకు  సంబంధించి ఏర్పాటు చేయనున్న టేబుల్లు ,రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు కేంద్రంలోకి  అనుమతించేవారు, సీసీటీవీలు, రిపోర్టు లు, డిస్ప్లే, తదితర అంశాలపై సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారుహనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వోలు డాక్టర్ కె. నారాయణ, వెంకటేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

Designing The Future: Pineapple House Design

Jaibharath News

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలి

Thailand Earns Nearly 70 Awards in SmartTravelAsia.com

Jaibharath News