జై భారత్ వాయిస్ వరంగల్
జూన్ మూడవ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు
జిల్లాలో అన్ని ఆవాసాలలో బడి మానేసిన బాల బాలురలను గుర్తించి సమీప పాఠశాలల్లో వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా నమోదు శాతాన్ని పెంచాలని అన్నారు కమ్యూనిటీని పాఠశాల భాగస్వామ్యం చేయాలని తెలిపారు అంగన్వాడీలో చదువుతున్న పిల్లల్ని బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయాలని వారి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను వారి భాగస్వామ్యంతో సంబంధిత విద్యార్థులను ఆయా తరగతులలో చేర్పించే విధంగా చూడాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులను విద్యార్థులకు తెలియపరచి వారి తల్లిదండ్రులకు తెలియపరచి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు ఏకరూప దుస్తులు నోట్ బుక్స్ ఉచితంగా ఇవ్వబడతాయని దివ్యాంగులకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వబడుతుందని మధ్యాహ్నం భోజనం వసతి ఉంటుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని నాణ్యమైన విద్యను అందించగలుగుతామని చెప్పారు మూడవ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం పై బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంబంధిత ప్రభుత్వ పాఠశాలలు కస్తూరిబా గాంధీ విద్యాలయాలు ఉపాధ్యాయులచే కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.
previous post