జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న అన్ని జాతీయ కార్యక్రమాలు వివరాలను గురించి వైద్యాధికారి డాక్టర్ అర్చనను అడిగి తెలుసుకున్నారు. అన్ని కార్యక్రమాలకు సంబంధించిన టార్గెట్లు పూర్తి అయిన విషయాలనుఅడిగి తెలుసుకున్నారు. రాబోవు వర్షాకాలంలో సీజన్ వ్యాధుల గురించి అప్రమత్త గా ఉండాలని తెలియజేశారు. తర్వాత వైద్య సిబ్బందికి సమయపాలన పాటించాలని ఆరోగ్య కార్యక్రమాల యందు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందియగలరని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు