ప్రపంచం వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని కొత్తవాడ పద్మశాలి ఫంక్షన్ హల్లో ,వరంగల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హైమావతి వయోవృద్ధులు అడిగిన ప్రశ్నలను నివృత్తి చేసి, ప్రభుత్వం తరఫున వయవృద్ధులకు తగు సహాయాలు అందిస్తామని కోరినారు , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ ఉచిత వైద్యం గూర్చి వివరించారు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యవంతముగా, గడపాలని, బీపీ షుగర్ వ్యాధులను నియంత్రిచుకుంటూ కోరినారు,
జిల్లా న్యాయ సేవాధికారి తరపున సురేష్ అడ్వకేట్ లీగల్ ఏడ్ సర్వీస్ కౌన్సిలర్ , సహాయం ఎలా పొందాలో పూర్తిగా వివరించారు, వృద్ధులు వీలునామా మాత్రమే రాయాలి గిఫ్ట్ డిడ్లను చేయవద్దు,సేల్ డీడ్లను చేయవద్దు, శేష జీవితాన్ని ఆర్థిక సమస్యలు లేకుండా గడుపుకోవాలని వివరించారు.ఈ సమావేశంలో నాలుగు వందల మంది వయోవృద్ధులకు వేధింపుల నివారణ పై అవగాహన కల్పించడంజరిగింది వయోవృద్ధులకు కలిగే వేధింపుల రకాలు నివారణోపాయాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల సదానందం, కార్యనిర్వాణాధికారి నన్నపు సంజీవరావు, శ్రీ కందుల గోవర్ధన్, తాళ్ల ఉమాదేవి, ఏం మల్లిక ఉపాధ్యక్షులు గార్లు, ట్రెజరర్ వెంకట మల్లు గారు, గుర్రం నరసింహా రాములు, సలహాదారులు ఆడెపు రాజేంద్రప్రసాద్, దొమ్మేటి రాజమౌళి గార్లు కార్యక్రమాన్ని నిర్వహించారు.

previous post