Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులలో వేగగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.శనివారం గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో డివిజన్ల వారిగా కూలంకషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూమహా నగరంలో పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్, సిఎంఏ, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్, స్మార్ట్ సిటీ తదితర పథకాల క్రింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతి సమీక్షించి సకాలంలో పూర్తి చేయడంతో పాటు టెండర్ అయిన పనులను తక్షణమే ప్రారంభించాలని, జనరల్ ఫండ్ క్రింద ఇంకను మిగిలియున్న పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.ఈ సమీక్ష లో ఈఈలు శ్రీనివాసరావు, సంజయ్ కుమార్, డీఈ లు రవి కుమార్, సంతోష్ బాబు, రవి కిరణ్,q సారంగం, రంగారావు, జేఎఓ సరిత, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గీసుకొండలోఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి వేడుకలు

హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

కరెంటు పోల్స్ ఏర్పాటు చేయాలి

Sambasivarao