Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అంతర్జాతీయ మోసగాళ్ల ముఠాను పట్టుకున్న పోలీసులు

జై భారత్ వాయిస్ వరంగల్
భారీ వాహనాలు తీసుకొని వెళ్లి ఇతరులకు, స్క్రాప్ కు లేదా నెదర్లాండ్, సౌత్ ఆఫ్రికా, కంబోడియా లాంటి విదేశాలకు అమ్ముతున్న దశరథ్ ముఠా గ్యాంగ్ అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు ముఠా సభ్యులు సులభంగా డబ్బు సంపాదించాలని ఆశలతో కార్ల దొంగతనానికి పాల్పడిన అంతర్జాతీయ స్థాయి దొంగలను వరంగల్ మట్టేవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు వరికుప్పల దశరథ, దుర్గం సందాస్,  కౌశెట్టి రాకేష్,మహమ్మద్ జాబీర్,సులభంగా డబ్బు సంపాదించాలని దుర్దేశంతో రాష్ట్రంలో సంపన్నుల దగ్గర ఉన్న కార్లను టార్గెట్ చేస్తూ వాటిని దొంగలించి విదేశాలలో అమ్మడానికి,అలాగే స్క్రాప్ చేసి అమ్మారు. ఇంతవరకు కోట్ల విలువైన కార్లను దొంగతనం చేసి అమ్మినట్లు విచారణలో తెలిసింది. ఇప్పటికే ఆ నలుగురిపై 16 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కేసులలో జైలుకు వెళ్లి వచ్చి మరి మళ్ళీ అదే దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకొని  ఆదివారం  మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుండి సుమారు 70 లక్షల విలువచేసే ఐదు కారులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశతో పక్కదారి పడుతున్న వారు ఎప్పటికైనా చట్టానికి దొరుకుతారని ఎవరు కూడా సులభంగా సంపాదించాలని ఆలోచన పోకుండా కష్టపడి సంపాదించాలని మీడియా సమావేశంలో డిసిపి భారీ అన్నారు.

Related posts

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడ సేవ