Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు హామ

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం,

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గా ఎన్నికైన సురేంద్రబాబును ప్రజా వేదిక దగ్గర జర్నలిస్టులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ విలేకరుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఇంటిస్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం, నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం చేపట్టాలని, జర్నలిస్టుల కు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలని వినతి పత్రం అందించారు. వీటన్నింటిని కూలంకషంగా విన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు తొలి ప్రాధాన్యంగా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం పనులు మొదలు పెడదామని మిగిలిన సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేద్దాం అన్నారు . కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు కరణం తిప్పేస్వామి , నియోజకవర్గ అధ్యక్ష , ఆర్గనైజింగ్ కార్యదర్శులు డి రవీంద్ర , చంద్రశేఖర్, వలీసాబ్,, హరినాథ్, నెపోలియన్, అనిల్ ,తిమ్మరాజు, నరసింహులు, ఇషాక్, తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Gangadhar

టిడిపిలోకి చేరిన ఎనిమిది కుటుంబాలు తీర్థం పుచ్చుకున్న సురేంద్రబాబు

Jaibharath News

గన్ మెన్ల అత్యుత్సాహం పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి సవితమ్మ

Jaibharath News