జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన నల్ల సరోజన మాదాసి స్వామి ( గ్రామ పంచాయతీ కార్మికుడు) నిరుపేద వ్యక్తులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న గీసుకొండ హైస్కూల్ లో విధులు నిర్వహించిన పూర్వపు ఉపాధ్యాయురాలు ముత్తినేని జయలక్ష్మి తన తండ్రి కీ|| శే|| ముత్తినేని మనోహర్ రావు జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు ఆర్థికసహాయాన్ని పంపగా, అట్టి నగదును గీసుకొండ గ్రామానికి చెందిన కర్ణకంటి రాంమూర్తి బాధితులకు చెరొక రెండు వేల ఐదు వందలు చొప్పున అందచేశారు ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు మాదాసి రాంబాబు, పద్మ పాల్గొన్నారు.
previous post