గ్రేటర్ వరంగల్ నగరంలో శానిటేషన్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హెచ్చరించారు. మంగళవారం హన్మకొండ శానిటేషన్ సర్కిల్ నెంబర్ 9 పరిధి అశోక థియేటర్ సమీపం లో గల శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం, అమృత థియేటర్ పాయింట్ వద్ద ఉదయం ఐదుగంటలకే పారిశుధ్య సిబ్బంది అటెండెన్స్ ను కమీషనర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించి సిబ్బంది గైర్హాజరు కు గల కారణాలను అధికారులను, గత రెండు రోజులుగా ఎక్కడ పనిచేశారు? ఏ ఏ పనులు చేశారో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరైతే జీతంలో కోత విధించాలని, అవుట్ సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది సుదీర్ఘకాలం విధులకు రాకుంటే తొలగించాలని, పిన్ పాయింట్ ప్రోగ్రాంలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్ లకు చెత్త తొలగింపు, డ్రైన్ లలో డీసిల్టేషన్, రోడ్లను శుభ్రంగా ఉంచడం సంబంధిత అంశాల పై సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. కుమార్ పల్లి ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ రెండు వైపులా డ్రైన్ ఉండగా ఒక వైపు చెత్త తొలగించకపోవడం పట్ల జవాన్ పై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో చెత్త రోడ్డుపై ఉండడాన్ని గమనించిన కమీషనర్ చెత్త రోడ్డుపై వేసే వారిపై లిట్టర్ పెనాల్టీ లు విధించాలని సిఎంహెచ్ ఓ ను ఆదేశించారు.
అమృత థియేటర్ సమీపంలో అటెండెన్స్ పాయింట్ వద్ద సిబ్బంది అటెండెన్స్ ను కమిషనర్ పరిశీలించారు.
మచిలీబజార్ ప్రాంతం లో శానిటేషన్ తీరు ను పరిశీలించి నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పని తీరు మెరుగు పడాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. శానిటేషన్ నిర్వహణ తీరుపై స్థానికంగా నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్ సానిటరీ సూపర్వైజర్ పసునూరి భాస్కర్ సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ జవాన్ లు పారిశుద్ద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
previous post
next post