Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లిహన్మకొండ జిల్లా

విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ


జై భారత్ వాయిస్ దుగ్గొండి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లోని మందపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్థానిక  స్ఫూర్తి మహిళా సమాఖ్య సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు.  పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేదరి పద్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చిన యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయురాలు నిర్మల, అంగన్వాడీ టీచర్ గ్రేస్, మహిళా సంఘం విఓఏ అంబరగొండ మధురాబాయి పాల్గొన్నారు.
  ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు తమ స్వంత ఖర్చులతో నోటు బుక్స్ సమకూర్చిన మహిళా సంఘాల వారికి ధన్యవాదాలు తెలిపారు.  గ్రామంలోని మహిళలంతా ప్రైవేటు స్కూల్ బస్సులను గ్రామంలోకి రాకుండా, తమ ఊరి పాఠశాలను బతికించుకోవాలని తద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, సత్ప్రయోజనాలను పొందాలన్నారు

Related posts

How to Use Auto AF Fine Tune on Your Nikon DSLR the Right Way

Jaibharath News

ఆత్మకూరు ఎస్ ఐ సస్పెన్షన్ నిలిపి వేయాలి

Jaibharath News

సాయి బాబా ఆలయంలో ఉత్స వాలు

Jaibharath News