జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలందరికీ జాతీయ నులిపురుగు దినోత్సవం సందర్భంగా అన్ని పాఠశాలల్లో అంగన్వాడి సెంటర్ల యందు జూనియర్ కాలేజీ నందు నులి పురుగు మాత్రలను వైద్య సిబ్బంది వేశారు మండలంలోని1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లల సంఖ్య 10840 గాను 10512మంది పిల్లలకు నులి పురుగు మాత్రలను వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన కొనాయమాకులోని పాఠశాలలో పాల్గొని మాత్రలు వేయడం జరిగినది. గురువారం మాత్రలు తీసుకొని మిగతా పిల్లలకు జూన్ 27న వేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి,సూపర్వైజర్లు కిరణ్ కుమార్,స్వరూప, అన్ని ఉప కేంద్రాల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పాఠశాలలో ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు
